IPL 2021 DC Vs SRH: ఢిల్లీ 'సూప‌ర్' విక్ట‌రీ

IPL 2021 DC Vs SRH
x

IPL 2021 DC Vs SRH

Highlights

IPL 2021 DC Vs SRH: ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.

IPL 2021 DC Vs SRH: ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు 'టై' కావడంతో.. చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 7 పరుగులు చేయగా...ఢిల్లీ క్యాపిటల్స్ 8 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

అంతకు ముందు ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... రిషభ్‌ పంత్‌ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (25 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం 160 ప‌రుగుల విజ‌యల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లపోయి 159 పరుగులు చేసింది. హైద‌రాబాద్ ఆట‌గాళ్ల‌లో కేన్‌ విలియమ్సన్‌ (51 బంతుల్లో 66 నాటౌట్‌; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో విజ‌యం ముంగిట వ‌ర‌కు తీసుకొచ్చాడు. బెయిర్‌స్టో (18 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖ‌రి బంతికి రెండు పరుగులు చేస్తే గెలవాల్సిన రావ‌డంతో హైద‌రాబాద్ సింగిల్‌కే పరిమితమైంది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్ చేసిన‌ సన్‌రైజర్స్ 7 ప‌రుగులు చేసింది. డీల్లీ బౌలర్‌ అక్షర్‌ పటేల్ వేసిన ఆ ఓవ‌ర్ 0, 1, 4, 0, 1, 1 వ‌చ్చాయి. చివరి బంతికి వార్నర్ 2 పరుగులు తీసినా.. తొలి సింగిల్‌ పూర్తి చేసే సమయంలో బ్యాట్‌ పూర్తిగా క్రీజ్‌లో ఉంచలేదని అంపైర్‌ 'షార్ట్‌ రన్‌'గా ప్రకటించాడు.దీంతో స‌న్ రైజ‌ర్స్ ఓట‌మి ఖాయ‌మైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories