PBKS vs DC: పంజాబ్‌పై ఢిల్లీ విజయ ఢంకా; ధావన్ సూపర్ బ్యాటింగ్(70*)
IPL 2021 PBKS vs DC: పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం
IPL 2021 PBKS vs DC: పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటిస్థానాన్ని పొందింది. ధావన్ అద్భుత బ్యాటింగ్ తో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్‌లు నిలకడగా ఆడి స్కోరుబోర్డు ఉరకలెత్తించారు. వరుస బౌండరీలతో ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా((39) హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ 24, పంత్ 14 విఫలమైనా... చివర్లో హిట్ మేయర్ కేవలం 4 బంతుల్లో 2 సిక్సులు, 1 పోర్ తో 16 రాబట్టి గెలిపించాడు.
ఇక బౌలర్లలో మెరిడిత్, జోర్దాన్, బ్రార్ తలో వికెట్ సాధించారు.
Next Story




