DC vs KKR: నేడు ఢిల్లీతో తలపడనున్న కలకత్తా.. తుది జట్టు వివరాలు ఇలా.!!

* షార్జా వేదికగా హోరాహోరి పోరుకు సిద్దమైన ఢిల్లీ - కలకత్తా జట్లు

Sandeep Reddy
Updated on: 28 Sept 2021 4:45 PM IST
IPL 2021 Delhi Capitals vs Kolkata Knight Riders Match in Sharjah Cricket Stadium Today 28 07 2021
X

నేడు ఢిల్లీతో తలపడనున్న కలకత్తా (ఫైల్ ఫోటో)

DC vs KKR: ఐపీఎల్ 2021 మరో రసవత్తరమైన పోరుకు సిద్దమవుతుంది. మంగళవారం కలకత్తా నైట్ రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే 8 విజయాలతో 16 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ జట్టు ఈరోజు జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి దూసుకుపోడానికి తహతహలాడుతుంది.

మరోపక్క కలకత్తా నైట్ రైడర్స్ రెండో ఫేజ్ లో అద్భుత ప్రదర్శనతో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి 8 పాయింట్స్ తో టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ కోసం ఇతర జట్లతో పోటీపడుతుంది. ఇక కలకత్తా నైట్ రైడర్స్ జట్టులో యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ వెంకటేష్ అయ్యర్ ఓపెనర్ గా అద్భుత బ్యాటింగ్ తో కలకత్తా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే చెన్నై తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన కలకత్తా అల్ రౌండర్ అండ్రు రసెల్స్ మంగళవారం జరగనున్న మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడో లేదో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రసెల్స్ అందుబాటులో లేనియెడల అతడి స్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ ఉల్ హసన్ ని జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.

ఇక సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ తన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విషయానికొస్తే శ్రేయాస్ అయ్యర్ తో రెండో ఫేజ్ లో రెండు మ్యాచ్ లలోనూ 47,43 పరుగులతో తన సత్తాచాటాడు. ఇక రిషబ్ పంత్, పృథ్వి షా, శిఖర్ ధావన్ లు ఎక్కువ పరుగులు సాధించలేకపోయిన ఫర్వాలేదనిపించారు. షార్జా క్రికెట్ స్టేడియం బౌండరీ చిన్నదిగా ఉన్నా పిచ్ నెమ్మదించడంతో బంతిని అంచనా వేయలేక బ్యాట్స్ మెన్ ఇబ్బందిపడే అవకాశాలున్నాయి.

ఇప్పటివరకు కలకత్తా నైట్ రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 27 మ్యాచ్ లు జరగగా 14 మ్యాచ్ లలో కలకత్తా నైట్ రైడర్స్, 12 మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించగా ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. మంగళవారం జరిగే మ్యాచ్ లో ఇరుజట్ల తుది జట్టుల విషయానికొస్తే..

కలకత్తా నైట్ రైడర్స్ జట్టు: శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్, నితీష్ రాణా, దినేష్ కార్తీక్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా / స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story