IPL 2021: ఢిల్లీ లక్ష్యం 189

Samba Siva Rao
Updated on: 10 April 2021 9:45 PM IST
IPL 2021
X

CSK

IPL 2021: ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14 రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54,36బంతుల్లో, 3ఫోర్లు 4సిక్సులు) అర్థ సెంచరీతో రాణించగా..ఆఖర్లో సామ్ కర్రన్ (34 ,15బంతుల్లో) రాణించాడు. ధోని ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. జడేజా రెండు పరుగులు తీశాడు. జడేజా, కరన్‌ ఇద్దరూ కలిసి 26 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొయిన్ అలీ 36, అంబటి రాయుడు, 23, రవీంద్ర జడేజా 26, సామ్ కర్రాన్ 34 పరుగులు చేశారు. దీంతో చెన్నై స్కోరు 188 పరుగుల వద్ద ముగిసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఖాన్, చెరో రెండు వికెట్ల పడగొట్టగా.. టామ్, అశ్విన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story