DC vs KKR: పృథ్వీ 'షో'... కోల్‌‌కతాపై ఢిల్లీ ఘన విజయం

DC vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది.

Venkata Chari
Published on: 29 April 2021 10:49 PM IST
IPL 2021: Dehi Capitals Won by 7 Wickets
X

పృథ్వీ షా సూపర్ బ్యాటింగ్ (ఫొటో ట్విట్టర్)

DC vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. పృథ్వీ షా 82, ధావన్‌ 46 ఊచకోతతో సునాయసంగా విజయం ముంగిట నిలిచింది.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పృథ్వీ షా, ధావన్‌ లు ధాటిగా ఆడడంతో గెలుపు నల్లేరుపై నడకలా మారింది. మొదటి నుంచి దూకుడిగా ఆడిన పృథ్వీ షా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరైనా ఊచకోత కోశాడు. బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈక్రమంలోనే కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు ధావన్ నెమ్మదిగా ఆడుతూ హాఫ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్ 3వికెట్లు తీశాడు.

Venkata Chari

Venkata Chari

Next Story