IPL 2020: కొత్త అవ‌తార‌మెత్తిన యువీ..

IPL 2020: క్రికెట్ లో ఆయ‌న ఓ సంచ‌ల‌నం. టీమిండియాలో బాధ్య‌తయుత పాత్ర‌ను పోషించిన వ్య‌క్తి.. ఓట‌మి అంచున ఉన్న మ్యాచ్‌ల‌ను ఒంటి చేతితో గెలిపించిన బ్యాట్‌మెన్స్‌

Karampoori Rajesh
Published on: 7 Sept 2020 9:05 AM IST
IPL 2020: కొత్త అవ‌తార‌మెత్తిన యువీ..
X

Yuvraj Singh,

IPL 2020: క్రికెట్ లో ఆయ‌న ఓ సంచ‌ల‌నం. టీమిండియాలో బాధ్య‌తయుత పాత్ర‌ను పోషించిన వ్య‌క్తి.. ఓట‌మి అంచున ఉన్న మ్యాచ్‌ల‌ను ఒంటి చేతితో గెలిపించిన బ్యాట్‌మెన్స్‌.. ఎన్నో సార్లు త‌న ఆట తీరుతో మంత్ర‌ముగ్ధుల‌ను చేసిన ఆట‌గాడు. ఎన్నో సార్లు టీమిండియాకు అండ‌గా ఉన్న బ్యాటింగ్‌ వీరుడు. బౌలింగ్ మంత్రికుడు. అత‌డే యువ‌రాజు సింగ్‌. ప్ర‌పంచ క‌ప్ పోటీలో ఆరు సిక్స్‌ర్ల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక రికార్డును సృష్టించుకున్నాడు. మ‌రో వైపు హ్యాట్రిక్ వికెట్లు తీసి మురిపించాడు. ఆ యువ‌రాజు సింగ్ ఇప్పుడో కొత్త అవ‌తారమెత్తాడు. చాలా మంది క్రికెట్ అభిమానులు... ముఖ్యంగా యువీ అభిమానులు యువ‌రాజు సింగ్ ఏ జట్టు త‌రుపున ఆడుతున్నార‌ని ఆరా తీసున్నారు.

కానీ యువ‌రాజు మాత్రం కొత్త అవ‌తార‌మెత్తాడు. అదీకూడా కింగ్స్ లేవ‌న్ పంజాబ్‌కు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఆట‌గాళ్లకు స‌రికొత్త మేలుకువుల‌ను నేర్ప‌నున్నాడు. త‌క్కువ బంతుల్లో ఎక్కువ సోర్కు ఏవిధంగా చేయాలి. ఇందుకోసం క‌రోనా కాలంలో కొంత మంది పంజాబ్ యువ‌ ఆటగాళ్ల కోసం త‌‌న సొంత జిమ్‌ను ఇచ్చి.. వారికి క్రికెట్ పాఠాలు నేర్పించారు. యువీ ఈ అవ‌తారంలో ఏవిధంగా రాణిస్తాడో చూడాలి.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story