IPL 2020 Updates: చెన్నై సూపర్ బౌలింగ్.. విజయలక్ష్యం 163 పరుగులు

IPL 2020 Updates: చెన్నై సూపర్ బౌలింగ్.. విజయలక్ష్యం 163 పరుగులు
x
Highlights

IPL 2020 Updates: చెన్నై బౌలింగ్ లోనూ ఫీల్డింగ్ లోనూ ఆదరగోట్టింది. ముంబై ఇండియన్స్ ను కట్టడి చేసింది..

ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ సూపర్ స్టార్ట్ అయింది. క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మజా మొదటి మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లోనే దొరికింది. కళ్ళు చెదిరే బ్యాటింగ్ స్ట్రోక్స్ తో బ్యాటింగ్ లో రెచ్చిపోతున్న ముంబాయ్ ఇండియన్స్ ఆటగాళ్లకు.. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో కళ్ళెం వేసిన చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్.. అదిరిపోయే క్యాచ్ లు.. పొట్టి క్రికెట్ లోని మజా ఏమిటో మళ్ళీ చూపించాయి. ఆధిపత్యం కోసం పోరు.. బంతికి..బ్యాట్ కు మధ్య రసవత్తరంగా సాగింది.

మొదటి ఓవర్ మొదటి బంతికే బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ అదే ఊపును కొనసాగించింది. కానీ..తేరుకున్న చెన్నై బౌలర్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. వరుసగా ఒపెనర్లిద్దరినీ పెవిలియన్ బాట పట్టించారు. దీంతో 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

పదకొండో ఓవర్ ప్రారంభంలోనే మరో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై. తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడినా చెన్నై బౌలింగ్..ఫీల్డింగ్ ల ముందు నిలబడలేక పోయారు. పదిహేను ఓవర్లు దాటిన తరువాత నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయింది ముంబై. చివరకు 162 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది..

మొత్తమ్మీద మొదటి ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి ప్రదర్శన చేసింది అనే చెప్పాలి. అయితే, ఈ పిచ్ మీద 163 పరుగులు విజయలక్ష్యం కష్టమైనదే. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఏం చేస్తోందో చూడాల్సిందే.

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ 162/9 (20)

స్కోర్ కార్డు: రోహిత్ శర్మ 12 (10) క్వింటన్ డి కాక్ 33 (20) సూర్యకుమార్ యాదవ్ 17(16) సౌరభ్ తివారీ 42 (31) హార్దిక్ పాండ్యా 14 (10) కీరోన్ పొలార్డ్ 18 (14) క్రునాల్ పాండ్యా 3 (3) జేమ్స్ ప్యాటిన్సన్ 11 (8) రాహుల్ చాహర్ నాటౌట్ 2 (4) ట్రెంట్ బౌల్ట్ 0 (1) జస్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 5 (3) చెన్నై సూప‌ర్ కింగ్ టార్గెట్ 163

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ :

దీపక్ చాహర్ 4 - 32 - 2, సామ్ కుర్రాన్ 4 - 28- 1, లుంగి ఎన్గిడి 4 - 38- 3, పియూష్ చావ్లా 4- 21- 1, రవీంద్ర జడేజా 4 - 42- 2




Show Full Article
Print Article
Next Story
More Stories