IPL 2020: ఆ రెండు జ‌ట్ల‌ మధ్యే ఐపీఎల్ ఫైనల్: ఆకాశ్‌ చోప్రా

IPL 2020: ఆ రెండు జ‌ట్ల‌ మధ్యే ఐపీఎల్ ఫైనల్: ఆకాశ్‌ చోప్రా
x

ఆకాష్ చోప్రా 

Highlights

IPL 2020: ఐపీఎల్‌ 2020 క్రికెట్ అభిమానుల‌కు ఎంతో మజా అందిస్తున్న‌ది. ప్రతి రోజూ ఉత్కంఠ పోరుకు వేదిక అవుతుంది. ఇప్ప‌టికే కీలక దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో ఒక్కో జట్టు 8 చొప్పున మ్యాచ్‌లు ఆడాయి.

IPL 2020: ఐపీఎల్‌ 2020 క్రికెట్ అభిమానుల‌కు ఎంతో మజా అందిస్తున్న‌ది. ప్రతి రోజూ ఉత్కంఠ పోరుకు వేదిక అవుతుంది. ఇప్ప‌టికి కీలక దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో ఒక్కో జట్టు 8 చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ముంబై, ఢిల్లీలు 1, 2 స్థానాల్లో ఉండగా.. ఆర్సీబీ 10 పాయింట్లతో మూడో స్థానంలో.. కోల్‌కతా 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లు 6 పాయింట్లతో.. తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక పంజాబ్ 4 పాయింట్లతో అట్టడుగున ఉంది. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గురువారం గెలిచిన పంజాబ్ తన ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇక పంజాబ్ ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇంటికే. ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు ముంబై , ఢిల్లీ జట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీత‌డుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితి బట్టి చూస్తే.. ముంబై, ఢిల్లీ జట్ల మధ్యే ఫైనల్ జరిగేలా కనిపిస్తోందని టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశో చోప్రా అభిప్రాయము వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 'మనం ముంబై, ఢిల్లీ జట్ల మధ్యే ఐపీఎల్ 2020 ఫైనల్స్ చూడవచ్చేమో' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ స్పందించారు. నీకు అరటి పండు తొక్క కనిపించడం లేదా? అంటూ చెన్నై సూపర్ కింగ్స్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ బదులిచ్చారు. ఫైనల్ చేరే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి అని అర్థం వచ్చేలా మూడీ ట్వీట్ చేశారు. ఈరోజు ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య షార్జా వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో ఆరు నుంచి ఏడుకి పడిపోయే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ గెలిస్తే పట్టికలో మళ్లీ నెం.1 స్థానాన్ని దక్కించుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories