Top
logo

IPL 2020: ఉత్కంఠ పోరులో కోల్‌కతా 'సూప‌ర్' విక్ట‌రీ

IPL 2020: ఉత్కంఠ పోరులో కోల్‌కతా  సూప‌ర్ విక్ట‌రీ
X

IPL 2020: ఉత్కంఠ పోరులో కోల్‌కతా 'సూప‌ర్' విక్ట‌రీ

Highlights

IPL 2020: ఐపీఎల్ .. నిజంగానే క్రికెట్ అభిమానుల‌కు పూల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. బంతి బంతికి ఏమౌతుందో అనే న‌రాలు తెగేంత‌ ఉత్కంఠ అందిస్తుంది.

IPL 2020: ఐపీఎల్ .. నిజంగానే క్రికెట్ అభిమానుల‌కు పూల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. బంతి బంతికి ఏమౌతుందో అనే న‌రాలు తెగేంత‌ ఉత్కంఠ అందిస్తుంది. ఈ రోజు కోల్ క‌తా , స‌న్ రైజ‌ర్ మ్యాచ్‌లో కూడా స‌రిగా అదే జ‌రిగింది. ఇరు జ‌ట్టు గెలుపు అంచుల‌కు తాకాయి. కానీ ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం నిర్దేశించారు. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో క‌ల్‌క‌తా సూప‌ర్‌ విక్ట‌రీ సాధించింది.

సూపర ఓవర్లో మొదట బ్యాటింగ్ కు వ‌చ్చిన స‌న్ రైజ‌ర్స్ ను కేకేఆర్‌ పేసర్‌ ఫెర్గ్యూసన్ అద్భుతంగా క‌ట్ట‌డి చేశాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ రెండు వికెట్లు కోల్పోయి.. కేవ‌లం రెండు ప‌రుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, మోర్గాన్.. నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించారు. దీంతో కోల్ క‌తా విజేత‌గా నిలిచింది. ఈ టోర్నీలో మ్యాచ్‌ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించడం ఇది మూడోసారి. ఇంతకు ముందు ఢిల్లీ-పంజాబ్, బెంగళూరు-ముంబై మ్యాచ్‌లు కూడా టై అయ్యాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 163 పరుగులు చేయగా, ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా నిర్ణీత ఓవర్లలో 163 పరుగులే చేసింది. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ విజయానికి 18 పరుగులు కావాల్సిన తరుణంలో 17 పరుగులే వచ్చాయి. రసెల్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతికి నో బాల్‌ వేశాడు. దాంతో నోబాల్‌కు పరుగు వచ్చింది. ఆ తర్వాత ఫ్రీహిట్‌ బంతికి రషీద్‌ ఖాన్‌ భారీ షాట్‌ కొట్టినా ఒక్క పరుగు మాత్రమే సాధించాడు. ఆ తర్వాత వార్నర్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి లెగ్‌ బై రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. దాంతో టై అయ్యింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠిలు శుభారంభం ఇచ్చారు. కాగా, త్రిపాఠి 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 ప‌రుగులు చేశారు. త్రిపాఠి అవుట్ అయిన త‌రువాత‌.. గిల్‌కు నితీష్‌ రాణా జత కలిశాడు. వీరి దూకుడుతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది. గిల్ 37 బంతుల్లో 36 ప‌రుగులు చేయ‌గా.. నితిష్ రానా 20 బంతుల్లో 29 ప‌రుగులు చేశారు. 13 ఓవ‌ర్ త‌రువాత‌ వీరిద్ద‌రూ వెనువెంట‌నే పెవిలియ‌న్ చేర‌గా.. ఆ తర్వాత రసెల్ వ‌చ్చాడు. కానీ అనుకున్నంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కేవ‌లం 9 ప‌రుగులు చేసి, అభిమానుల‌కు నిరాశ ప‌రిచాడు. చివర్లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కార్తీక్‌ 14 బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించగా, మోర్గాన్‌ 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మోర్గాన్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉంది. ఈ జోడి 58 పరుగులు జత చేయడంతో కేకేఆర్‌ గౌరవప‍్రదమైన స్కోరు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు సాధించగా, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌, బాసిల్‌ థంపిలకు తలో వికెట్‌ దక్కింది.

కేకేఆర్‌ నిర్దేశించిన 164 పరుగుల టార్గెట్‌ ఛేదనలో జానీ బెయిర్‌, కేన్‌ విలియమ్సన్‌లు ఓపెనింగ్‌కు దిగారు. వీరు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. విలియమ్సన్ 19 బంతుల్లో 29 ప‌రుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంత‌రం క్రీజ్ కు వ‌చ్చిన ప్రియాం గార్గ్ అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయాడు కేవలం 4 ప‌రుగులు చేసి ఫెవిలియ‌న్ చేశాడు. గార్గ్‌ ఔటైన కాసేపటికి బెయిర్‌ స్టో 36(28)కు వెనుదిరిగాడు మనీష్‌ పాండే(6) కూడా విఫలం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విజయ్‌ శంకర్ ది కూడా అదే ప‌రి‌స్థితి. కేవ‌లం 7ప‌రుగులు చేశాడు. ఆ సమయంలో వార్నర్‌(47;33 బంతుల్లో 5 ఫోర్లు) సామద్‌(23; 15 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌)ల జోడి సమయోచితంగా ఆడింది. మావి వేసిన 19వ ఓవర్‌లో అబ్దుల్‌ సామద్‌ భారీ షాట్‌ కొట్టగా, దాన్ని ఫెర్గ్యూసన్‌ క్యాచ్‌ పట్టి బౌండరీ లోపలకి విసిరేశాడు.దాని గిల్‌ పట్టుకోవడంతో సామద్‌ ఔటయ్యాడు. దాంతో చివరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒత్తిడి పెరగడం ఒకటైతే, రసెల్‌ బౌలింగ్‌ చేయడంతో బౌండరీలు ఈజీగా వచ్చాయి. ఆఖరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన సమయంలో పరుగు మాత్రమే రావడంతో మ్యాచ్‌ టై అయ్యింది.

Web TitleIPL 2020 SRH vs KKR Highlights: Kolkata Knight Riders beat Sunrisers Hyderabad via Super Over
Next Story