IPL 2020 SRH vs KKR: మ‌రో కీల‌క పోరు .. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో స‌న్ రైజ‌ర్స్ ఢీ

IPL 2020 SRH vs KKR: మ‌రో కీల‌క పోరు .. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో స‌న్ రైజ‌ర్స్ ఢీ
x

IPL 2020 SRH vs KKR: కోల్‌కత నైట్‌రైడర్స్‌తో స‌న్ రైజ‌ర్స్ ఢీ

Highlights

IPL 2020 SRH vs KKR: ఐపీఎల్ 2020లో నేడు కీలక మ్యాచ్ జ‌రుగునున్న‌ది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. స‌న్‌రైజ‌ర్స్ ఫ్లే ఆఫ్స్ లో చోటు ద‌క్కించుకోవాలంటే.. మాత్రం ఈ మ్యాచ్ చాలా కీల‌కం .

IPL 2020 SRH vs KKR: ఐపీఎల్ 2020లో నేడు కీలక మ్యాచ్ జ‌రుగునున్న‌ది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. స‌న్‌రైజ‌ర్స్ ఫ్లే ఆఫ్స్ లో చోటు ద‌క్కించుకోవాలంటే.. ఈ మ్యాచ్ చాలా కీల‌కం . ఇందులో విజయం సాధిస్తే.. ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరుకుంటుంది. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ చేరడానికి మిగతా మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కావున ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ వీరోచితంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

అబుదాబీ వేదికగా ఆదివారం మధ్యాహ్నం పారంభం కానున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఓపెనర్లు వార్నర్-బెయిర్ స్టోతోపాటు మనీష్ పాండే, విలియమ్సన్ రాణిస్తే.. భారీ స్కోరు చేయడమేం కష్టం కాదు. బౌలింగ్‌లో భువీ లేని లోటు తెలుస్తోంది. రషీద్ ఖానే కీల‌క బౌల‌ర్ అనుకున్న‌ప్ప‌టికీ.. గ‌తంలో లాగా వికెట్లు తీయలేకపోతున్నాడు. బౌలింగ్ విభాగంలో సందీప్ శర్మ, నటరాజన్, రషీద్ కీలకం కానున్నారు.

అలాగే.. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి గ‌త మ్యాచ్ నుంచి దినేశ్‌ కార్తీక్‌ తప్పుకున్నాడు. అప్పటి నుంచి జట్టు బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించింది. కొత్త కెప్టెన్ ఈ మ్యాచ్‌లో ఏం మ్యాజిక్ చేస్తాడోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ విభాగం అనుకున్న స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బర్చ‌డంలేదు. స్పిన్నర్ పియూష్ చావ్లా, లాకీ ఫెర్గ్యూసన్ ల‌ను ఆడించే అవకాశం ఉంటుంది. కమిన్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. వికెట్ల వేటలో వెనుకబడ్డాడు. రస్సెల్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. కోల్‌కతా ఓపెనర్లలో గిల్ నిలకడగా రాణిస్తుండగా.. మరో ఓపెనర్‌తో సమస్య ఎదురవుతోంది. నేడు జ‌రిగే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.

డ్రీమ్ 11 ఐపిఎల్ 2020 సన్‌రైజర్స్ ప్రాబబుల్ ఎలెవన్ - డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (డబ్ల్యూ), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కె ఖలీల్ అహ్మద్, టి నటరాజన్.

డ్రీమ్ 11 ఐపిఎల్ 2020 కెకెఆర్ ప్రాబబుల్ ఎలెవన్ - షుబ్మాన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (డబ్ల్యుకె), ఎయోన్ మోర్గాన్ (సి), పాట్ కమ్మిన్స్, రాహుల్ త్రిపాఠి, కమలేష్ నాగర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories