రేపే ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుద‌ల !

రేపే ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుద‌ల !
x
Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 షెడ్యూల్ రేపు విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఛైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ అధికారికంగా...

IPL 2020: ఐపీఎల్ 2020 షెడ్యూల్ రేపు విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఛైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ అధికారికంగా ప్ర‌క‌టించారు. శ‌నివార‌మే షెడ్యూల్‌ను విడుద‌ల చేస్తార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేయ‌నున్న‌ట్లు బ్రిజేష్ ప‌టేల్ ప్ర‌క‌టించారు. బ్రిజేష్ ప‌టేల్ మాట్లాడుతూ.. 'సెప్టెంబ‌ర్ 19 నుంచే ఐపీఎల్ 13వ సీజ‌న్ ప్రారంభం కానుంది. లీగ్కు‌‌ సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఐపీఎల్లో పాల్గొన‌బోయే అన్ని జ‌ట్లు ఇప్పటికే త‌మ ప్రాక్టీస్‌ను ఆరంభించాయి. ‌రేపు అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం. షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదిక‌గా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి' అంటూ తెలిపారు. సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్‌ జరుగనుంది. లీగ్‌లో 21 మ్యాచ్‌ల చోప్పున దుబాయ్, అబుదాబి ఆతిథ్యమివ్వనుండగా, షార్జాలో 14 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories