IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు షాక్!

IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ముంబాయి చేతిలో ఓడిపోయి .. బాధ ప‌డుతున్న స్మిత్ కు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది.

Karampoori Rajesh
Published on: 7 Oct 2020 11:42 AM IST
IPL 2020: రాజస్థాన్ రాయల్స్  కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు  షాక్!
X

IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు షాక్!

IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ముంబాయి చేతిలో ఓడిపోయి .. బాధ ప‌డుతున్న స్మిత్ కు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. ఐపీఎల్ లో మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌ స్లో ఓవర్‌ రేట్‌గా ఆర్ ఆర్ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు. రాయల్స్ తమ 20 ఓవర్ల కోటాను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో మొదటి తప్పుగా జరిమానా విధించారు. ఈ సీజ‌న్ లో మొద‌టి సారి ఈ జరిమానాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదుర్కొన్నారు.

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ ల‌క్ష్య చేధ‌న‌లో రాజస్థాన్ రాయ‌ల్స్ బ్యాట్ మెన్స్ త‌డ‌బ‌డ్డారు. కేవ‌లం 136 పరుగులకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్‌పై 57 పరుగుల తేడాతో ముంబై భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

కాగా, అక్టోబర్ 6న రాత్రి అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 136 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్‌పై 57 పరుగుల తేడాతో ముంబై భారీ విజయాన్ని అందుకుంది.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story