IPL 2020: ముంబై ఇండియ‌న్స్ న్యూ జెర్సీ అదుర్స్‌

IPL 2020: ముంబై ఇండియ‌న్స్ న్యూ జెర్సీ అదుర్స్‌
x

IPL 2020: Mumbai Indians Unveil Their New Jersey Ahead  

Highlights

IPL 2020: యూఏఈ వేదికగా జ‌ర‌‌నున్న ఐపీఎల్ 2020 రంగం సిద్దమైంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు అబుదాబికి చేరుకున్నాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ప్ప అన్ని జ‌ట్టు ప్రాక్టీస్ మొద‌లు పెట్టాయి. ఈ సంద‌ర్భంలో ముంబై ప్రాంచైజీ కొత్త స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

IPL 2020: యూఏఈ వేదికగా జ‌ర‌‌నున్న ఐపీఎల్ 2020 రంగం సిద్దమైంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు అబుదాబికి చేరుకున్నాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ప్ప అన్ని జ‌ట్టు ప్రాక్టీస్ మొద‌లు పెట్టాయి. ఈ సంద‌ర్భంలో ముంబై ప్రాంచైజీ కొత్త స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సీజన్‌ కోసం ముంబై ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందించింది.

బ్లూ, ఆరెంజ్‌ రంగుల్లో ఉన్న ఈ కొత్త జెర్సీలు ఆటగాళ్లకి మరింత వన్నె తెచ్చాయి. కొత్త జెర్సీ ఆవిష్కరణను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఒక పాట రూపంలో విడుదల చేసి.. దాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.

అలాగే ఇక అభిమానులు కూడా ఈ జెర్సీ కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకోసం ప్రీఆర్డర్‌ బుకింగ్ ప్రారంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హర్దీక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బూమ్రా కొత్త జెర్సీతో ఉన్న చిత్రాలను ముంబై ఇండియన్స్‌ అధికారిక ట్విట్టర్‌లో పెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆదివారం ఆ జెర్సీలనే ధరించి ప్రాక్టీస్ చేయ‌డం విశేషం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సీజ‌న్ కొన‌సాగ‌నున్నది. కాబ‌ట్టి నిర్వ‌హ‌కులు చాలా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తుంది. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబై, కోల్‌కతా జట్లు బీసీసీఐని సంప్రదించిచాయి.

ఇప్పటికే పలుమార్లు కరోనా పరీక్షలు చేసుకున్న తమకు ప్రాక్టీస్‌ చేసుకునే అనుమతులు ఇప్పించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను కోరాయి. గవర్నింగ్‌ కౌన్సిల్‌, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు కలిసి స్థానిక అధికారులను సంప్రదించాయి. దీంతో ఆదివారం నుంచి ఆ రెండు జట్లూ ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఆటగాళ్లు ఆదివారం కొత్త జెర్సీలతో సాధన చేశారు.

ముంబై మొదటిసారి 2013లో టైటిల్‌ను సాధించింది. అనంతరం 2015, 2017, 2019లో టైటిల్‌ విజేతగా నిలువగా అవతరించింది. ఈ నాలుగు ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే సాధించడం విశేషం. ఈ సారి కూడా ట్రోఫీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories