IPL 2020: చెన్నై ఓపెనింగ్ మ్యాచ్ ఆడట్లేదా!?

IPL 2020: చెన్నై ఓపెనింగ్ మ్యాచ్ ఆడట్లేదా!?
x

చెన్నై సూపర్ కింగ్స్ 

Highlights

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. భార‌త్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండ‌టంతో ఐపీఎల్ ను యూఏఈ వేదికగా జరిపేందుకు బీసీసీఐ నిర్ణ‌యించింది.

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. భార‌త్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండ‌టంతో ఐపీఎల్ ను యూఏఈ వేదికగా జరిపేందుకు బీసీసీఐ నిర్ణ‌యించింది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వ‌హించ‌నున్న‌ది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఐపీఎల్ ఓపెనింగ్ గేమ్ జరగాల్సి ఉంది. కానీ .. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై తలపడే అవకాశం ఇప్పుడు లేదు. తొలి మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ జట్టును కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో బిసిసిఐ ఆందోళనలో పడింది. చెన్నై జట్టు కు సంబంధించిన ఫాస్ట్ బౌలర్ బ్యాట్స్మెన్ ఇటీవలే కరోనా వైరస్ బారిన పడగా... స‌హాయ‌క సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. దీంతో అందరూ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే సెప్టెంబర్ 19 నాటికి... కరోనా బారిన పడిన ఆటగాళ్లు పూర్తిగా కోలుకునే అవకాశం తక్కువగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు చేసి మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను తప్పించి ఆ ప్లేస్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అప్ప‌టి వ‌ర‌కూ.. చెన్నై ఆటగాళ్లకు కోలుకునే సమయం దొరుకుతుందని... తర్వాత యధావిధిగా షెడ్యూల్ ఫాలో అయితే సరిపోతుంది అని బిసిసిఐ భావిస్తోందట. 2008 నుండి ఐపీఎల్ టోర్నీలో మొదటి మ్యాచ్ గత సీజన్ లో ఫైనలిస్టులు తలపడుతూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. గత సీజన్ లో ఫైనలిస్టులైనా టైటిల్ విజేత ముంబై.. రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ .

Show Full Article
Print Article
Next Story
More Stories