బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ విజయం

Arun Chilukuri
Published on: 29 Oct 2020 8:05 AM IST
బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ విజయం
X

ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ముంబై అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో 13వ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలిజట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోహ్లిని అవుట్‌ చేయడంద్వారా ముంబై బౌలర్‌ బుమ్రా ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. యాదృచ్చికంగా ఐపీఎల్‌లో బుమ్రా తొలి వికెట్, 100వ వికెట్‌ కోహ్లినే కావడం విశేషం. అంతేకాకుండా టి20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత పేస్‌ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story