IPL 2020: బ‌ట్ల‌ర్‌కు ధోనీ అరుదైన బ‌హుమ‌తి

IPL 2020: ఐపీఎల్ 2020 లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై పై రాజ‌స్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

Karampoori Rajesh
Published on: 20 Oct 2020 11:47 AM IST
IPL 2020:  బ‌ట్ల‌ర్‌కు ధోనీ అరుదైన బ‌హుమ‌తి
X

IPL 2020: బ‌ట్ల‌ర్‌కు ధోనీ అరుదైన బ‌హుమ‌తి

IPL 2020: ఐపీఎల్ 2020 లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై పై రాజ‌స్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో రాజ‌స్థాన్ 8 పాయింట్లతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన చెన్నై బ్యాట్స్ మెన్ల‌ను రాజ‌స్థాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టం చేశారు. టాప్ ఆర్డర్ విఫ‌లం కావ‌డంతో కేవ‌లం 126 పరుగులు మాత్రమే చేయ‌గ‌ల్గింది.

అనంత‌రం బ్యాటింగ్ కు వ‌చ్చిన రాజ‌స్థాన్ ఆదిలో త‌డ‌బ‌డ్డ బ‌ట్ల‌ర్‌, స్మిత్ లు టీమ్‌కు అండ‌గా.. నిలువ‌డంతో సునాయాసంగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కంటే విలువైన బహుమతి బట్లర్‌కు దక్కింది. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి.. ఊహించ‌ని విధంగా .. తన జెర్సీని బట్లర్‌కు బహూకరించాడు. బట్లర్‌కు ధోనీ అంటే అమితమైన అభిమానం.

ఈ విషయాన్ని బ‌ట్ల‌ర్ అనేక సార్లు ప్రస్తావించాడు. ఇప్పుడు ధోనీ తనదైన స్టయిల్లో మ్యాచ్‌లను ముగించలేకపోతున్నాడు. కానీ గతంలో ధోనీ మ్యాచ్‌లను ఫినిష్ చేసిన విధానం చూసిన బట్లర్.. మిస్టర్ కూల్‌కు ఫ్యాన్స్ అయిపోయాడు. 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ధోనీ.. తనకు ఇచ్చిన గిఫ్ట్ తో బట్లర్ అమిత‌మైన ఆనందం వ్య‌క్తం చేశారు.


Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story