మెరిసిన సుర్యకుమార్, ఇషాన్.. ముంబై భారీ స్కోర్!

మెరిసిన సుర్యకుమార్, ఇషాన్.. ముంబై భారీ స్కోర్!
x
Highlights

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఢిల్లీ , ముంబయి జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల చేసింది.

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఢిల్లీ , ముంబయి జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముంబై జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించింది.. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది.. ఆ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రూపంలో ముంబయి తొలి వికెట్‌ కోల్పోయింది.

అశ్విన్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్‌ వికెట్‌ కోల్పోయినప్పటికి . మరో ఓపెనర్‌ డికాక్‌ మాత్రం దూకుడుగానే ఆడాడు.. వరుస బౌండరీలతో ఢిల్లీ బౌలర్ల పైన విరుచుక పడ్డాడు.. అలా ధాటిగా ఆడుతున్న డికాక్‌ 40(25బంతుల్లో) ఎనమిదో ఓవర్లో అశ్విన్‌ వేసిన బంతిని భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి శిఖర్‌ ధావన్‌ చేతికి చిక్కాడు. దీనితో 79 పరుగుల వద్ద ఆ జట్టు రెండో వికెట్ కోల్పోయింది..

ఆ తరవాత మరో వికెట్ పడకుండా సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌ చాలా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో సుర్యకుమార్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.. అయితే ఆ వెంటనే నోర్జ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డానియల్‌ సామ్స్ చేతికి చిక్కి వెనుదిరిగాడు.. అప్పటికి ముంబై జట్టు 12ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఆ తరవాత వచ్చిన పొలార్డ్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు..

ఇక ముంబై జట్టు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది.. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది.. ఈ క్రమంలో కృణాల్‌ పాండ్య భారీ షాట్ కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..ఇక చివర్లో వచ్చిన హార్దిక్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌ వరుస బౌండరీలతో విరుచకపడడంతో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.. అటు ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. కాగా అటు ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది

Show Full Article
Print Article
Next Story
More Stories