IPL 2020: చెన్నై కింగ్స్ కు మ‌రో షాక్‌! భ‌జ్జీ ఏంట్రీపై ప‌లు అనుమానాలు?

IPL 2020: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. తొలుత జ‌ట్టులో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించ‌గా.. త‌రువాత రోజునే స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్‌ రైనా హఠాత్తుగా ఇండియా తిరిగి రావడంతో అక్కడి పరిస్థితులు ప‌లు అనుమానులు వ‌స్తున్నాయి.

Karampoori Rajesh
Updated on: 1 Sept 2020 1:48 PM IST
IPL 2020: చెన్నై కింగ్స్ కు మ‌రో షాక్‌! భ‌జ్జీ ఏంట్రీపై ప‌లు అనుమానాలు?
X

IPL 2020 : Harbhajan Singh  

IPL 2020: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. తొలుత జ‌ట్టులో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించ‌గా.. త‌రువాత రోజునే స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్‌ రైనా హఠాత్తుగా ఇండియా తిరిగి రావడంతో అక్కడి పరిస్థితులు ప‌లు అనుమానులు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో .. తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ కూడా ఈ సారి ఐపీఎల్‌ నుంచి తప్పుకునే పరిస్థితులున్నాయని క్రీడా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే హర్భజన్‌సింగ్‌ చెన్నై జట్టుతో కలవాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆయన దుబాయ్‌కే చేరుకోలేదు. దీంతో అతను ఐపీఎల్ ఆడుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులోని పలువురు సభ్యులకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో హర్భజన్‌ సింగ్‌ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేవని రైనా భార‌త్‌కు రావడంతో, భజ్జీ కూడా అనుమానులు వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అన్నిపరిస్థితులు‌ బాగుంటే టోర్నీ మధ్యలో జాయిన్ అవుతాడ‌ని హర్బజన్ సింగ్ సన్నిహితులు తెలుపుతున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story