IPL 2020: సన్‌రైజర్స్‌కు వెంకీమామా విషెస్‌

IPL 2020: సన్‌రైజర్స్‌కు వెంకీమామా విషెస్‌
x
Highlights

IPL 2020: ఐపీఎల్ ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. ఈ ఆట‌ను అభిమానించే వారిలో చిన్న, పెద్ద, పేద‌, ధ‌నిక‌, ఉన్నోడు, లేనోడు అనే తార‌తామ్యాలు అస‌ల్లేవు.

IPL 2020: ఐపీఎల్ ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. ఈ ఆట‌ను అభిమానించే వారిలో చిన్న, పెద్ద, పేద‌, ధ‌నిక‌, ఉన్నోడు, లేనోడు అనే తార‌తామ్యాలు అస‌ల్లేవు. ఈ సారి క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌త్యేక్షంగా చూసే అవ‌కాశాని అభిమానులు మిస్ అవుతున్నారు. అయినా ఐపీఎల్‌ అభిమానులకు అసలు సిసలు మజా అందిస్తోంది.తొలి మ్యాచ్ నుండి ఫ్యాన్‌ను పుల్ గా ఎంట‌ర్ టైన్‌మెంట్ పంచుతుంది. ఈ టోర్నీలో నేడు బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తలప‌డుతుంది.

ఈ క్రమంలో సన్ రైజర్స్ టీమ్‌ను సపోర్ట్ చేస్తూ వెంకటేష్‌ ఓ ట్వీట్ చేశాడు. 'ఆల్‌ దిబెస్ట్ SRH... నేను మిమ్మల్ని ఇంట్లోనే ఉండి ఉత్సాహపరుస్తాను' అని వెంకీ పోస్ట్ చేశాడు. వెంకటేష్‌ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఆరెంజ్‌ ఆర్మీ) బదులిచ్చింది. 'స్టాండ్స్‌లో ఉండి ప్రోత్సహించే మిమ్మల్ని మేం మిస్సవుతాం వెంకీమామా' అని రీట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

సినీన‌టుడు విక్టరీ వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పవ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఐపీఎల్ లో స‌న్‌రైజ‌ర్ హైద‌రాబాద్ మ్యాచ్‌ జరుగుతుందంటే హీరో వెంకటేష్ క‌చ్చితంగా గ్రౌండ్ లో ప్ర‌త్యేక్ష‌మ‌వుతాడు. త‌న‌దైన శైలిలో ఎంజ‌య్ చేస్తూ.. ఆరెంజ్ టీమ్ కు స‌పోర్ట్ చేస్తుంటారు. కానీ, క‌రోనా కార‌ణంగా ప్ర‌త్యేక్షంగా స్టేడియంలో వెళ్లి చూడ‌లేని పరిస్థితి.

Show Full Article
Print Article
Next Story
More Stories