చెలరేగిన బుమ్రా.. ముంబై లక్ష్యం 111

ముంబై, ఢిల్లీ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో ముంబై బౌలర్లు చెలరేగారు.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు బుమ్రా, బౌల్ట్ ల ధాటికి నిర్ణిత 20 ఓవర్లలలో తొమ్మిది వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమె చేయగలిగింది.

Krishna
Published on: 31 Oct 2020 5:45 PM IST
చెలరేగిన బుమ్రా.. ముంబై లక్ష్యం 111
X

ముంబై, ఢిల్లీ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో ముంబై బౌలర్లు చెలరేగారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు బుమ్రా, బౌల్ట్ ల ధాటికి నిర్ణిత 20 ఓవర్లలలో తొమ్మిది వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఢిల్లీ బాట్స్ మెన్స్ లో ఒక్కరు కూడా 30 పరుగులు చేయకపోవడం దారుణం. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, బుమ్రా మూడు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. వీరి ధాటికి ఢిల్లీ ఏ దశలో కూడా కోలుకోలేక పోయింది. అటు కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. ఇక ఢిల్లీ బాట్స్ మెన్స్ లలో శ్రేయస్‌ అయ్యర్ 25(29) ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుతానికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


Krishna

Krishna

Next Story