IPL 2020: ధోనీపై అభిమానంతోనే ఇలా చేశా..

IPL 2020: అభిమానం.. ఎవ‌రి మీద ఎలా? ఎప్పుడు ? ఏర్పుడుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం.. కానీ ఒక్క‌సారి ఎవరి మీద‌నైతే.. అభిమానం ఏర్ప‌డితే.. వారిని అంత తొంద‌ర‌గా విడిపెట్ట‌డం చాలా కష్టం.

Karampoori Rajesh
Published on: 14 Oct 2020 3:22 PM IST
IPL 2020: ధోనీపై అభిమానంతోనే ఇలా చేశా..
X

IPL 2020: ధోనీపై అభిమానంతోనే ఇలా చేశా..

IPL 2020: అభిమానం.. ఎవ‌రి మీద ఎలా? ఎప్పుడు ? ఏర్పుడుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం.. కానీ ఒక్క‌సారి ఎవరి మీద‌నైతే.. అభిమానం ఏర్ప‌డితే.. వారిని అంత తొంద‌ర‌గా విడిపెట్ట‌డం చాలా కష్టం. న‌చ్చిన వారిపై అభిమానాన్ని చాటడంలో కూడా ఒక్కోరిది ఒక్కోలా ఉంటుంది. ప‌చ్చ‌బొట్లు వేసుకోవ‌డం, విగ్ర‌హాలు పెట్ట‌డం, గుడులు క‌ట్టడం , పూజ‌లు చేయ‌డం చూస్తుంటారు.

కానీ ఓ ధోనీ అభిమాని వినూత్నంగా ఆలోచించాడు. ఇప్పుడు ఆ అభిమాని చేసి ప‌ని సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతుంది. అత‌డే..గోపి క్రిష్ణన్ భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, ధోని అంటే ఎంతో అభిమానం.ఆయ‌న‌ది త‌మిళ‌నాడు కు చెందిన కడలూరు జిల్లా ఆరంగుర్ గ్రామ‌వాసి. ధోని పై తనకు ఉన్న అభిమానంతో .. తన ఇంటికి మొత్తం ఐపీఎల్ లో చెన్నై రంగు అయిన పసుపుతో నింపేసాడు. తన ఇంటి ముందు గోడల పైన ధోని చిత్రాలని, పక్క గోడలపైన సీఎస్కే లోగో ను అలాగే "విజిల్ పోడు" అనే ట్యాగ్ లైన్ ను పెయింట్ చేయించాడు.

ఇక ఆ ఇంటి ఫోటోలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నేను దోనీకి గొప్ప అభిమానిని, ధోనీపై అభిమానంతోనే ఇలా చేశా..అతనిపై చాలామంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్‌లో అతను ఓ గొప్ప ఫినిషర్ అనే సంగతిని జనం మర్చిపోయారు. అందుకే నేను నా ఇంటిపై ధోనీ చిత్రాలు గీయించి ఆయన గొప్పతనం చాటాలనుకున్నాను అని చెప్పాడు.


Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story