T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ఇండియా జట్టు ఇదే

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌-2024 కోసం భారత్‌ తమ జట్టును ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 30 April 2024 4:11 PM IST
India’s Squad for ICC Men’s T20 World Cup 2024 Announced
X

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ఇండియా జట్టు ఇదే

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌-2024 కోసం భారత్‌ తమ జట్టును ప్రకటించింది. జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కాగా, హార్దిక్‌ పాండ్యను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది.

రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, బుమ్రా, సిరాజ్.

ట్రావెలింగ్ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌

Arun Chilukuri

Arun Chilukuri

Next Story