Ind vs NZ: కివీస్‌తో సిరీస్‌కు ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా

Ind vs NZ: రేపటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సిరీస్

Sandeep Eggoju
Updated on: 16 Nov 2021 8:49 PM IST
Indian vs New Zealand Series Stars From Tomorrow
X

రేపటినుండి ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ సిరీస్ (ఫైల్ ఇమేజ్)

Ind vs NZ: టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగాడు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ జరగనుండగా, టీమిండియా ఆటగాళ్లతో ద్రావిడ్ సాధన చేయించాడు. రేపటి మ్యాచ్‌ కోసం టీమిండియా ప్రాక్టీస్‌లో భాగంగా ద్రావిడ్ స్వయంగా త్రోడౌన్లు విసిరి సహకరించాడు. ద్రావిడ్ సమక్షంలో భారత క్రికెటర్లు ఉత్సాహంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీసు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story