Praggnanandhaa: చెస్ రారాజులకే షాకులిస్తున్న భారత యువ కెరటం

Praggnanandhaa: చెస్ రారాజుకే షాక్‌ల మీద షాకులిస్తున్నాడు. వయసులో చిన్నవాడైనా..చెస్‌ గేమ్‌లో మాత్రం పెద్ద పెద్ద ఉద్దండులకే చెక్ పెడుతూ వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

Arun Chilukuri
Updated on: 22 Feb 2022 9:00 PM IST
Indian Teenager Praggnanandhaa Beats World Chess Champion Carlsen
X

Praggnanandhaa: చెస్ రారాజులకే షాకులిస్తున్న భారత యువ కెరటం

Praggnanandhaa: చెస్ రారాజుకే షాక్‌ల మీద షాకులిస్తున్నాడు. వయసులో చిన్నవాడైనా..చెస్‌ గేమ్‌లో మాత్రం పెద్ద పెద్ద ఉద్దండులకే చెక్ పెడుతూ వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ప్రపంచ చెస్‌ చాంపియన్‌, వరల్డ్‌ నెంబర్‌వన్‌ కార్ల్‌సన్‌పై భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద ఇప్పటికే సంచలన విజయం నమోదు చేశాడు. అంతేకాదు తాజాగా మరో రెండు విజయాలను సాధించాడు. మంగళవారం జరిగిన పోటీల్లో ఈ 16 ఏళ్ల యువ కెరటం రష్యా ఆటగాడు నాడిర్‌బెక్‌ అబ్దుసట్టారావ్‌తో డ్రా చేసుకోగా 10, 12 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు. ఈ క్రమంలోనే 11వ రౌండ్‌లో జీఎం లాన్‌ నెమోనియాచి చేతిలో ఓడిపోయాడు. దీంతో ప్రజ్ఞానంద 15 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.

కొద్దిసేపటి క్రితమే జరిగిన పోటీల్లో ప్రజ్ఞానంద మరో ముగ్గురు ప్లేయర్లతో తలపడ్డాడు. తొలుత 13వ రౌండ్‌లో జర్మనీ ప్లేయర్‌ విన్‌సెట్‌ కీమర్‌తో, 14వ రౌండ్‌లో అమెరికా ప్లేయర్‌ హాన్స్‌ మోకె నీమన్‌తో పోరాడి విజయం సాధించాడు. ఆ తర్వాత చివరగా 15వ రౌండ్‌లో రష్యా ఆటగాడు వ్లాదిస్లేవ్‌ ఆర్తెమీవ్‌తో పోటీపడి తన సత్తాను నిరూపించుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story