కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-2020 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-2020 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే..
x
Highlights

కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు,...

కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ రద్దవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో పొట్టి క్రికెట్ పండగ ఐపీఎల్ సైతం వాయిదా పడింది. తమ రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించబోమని ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఐపీఎల్-2020ని వాయిదా వేసింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories