IPL 2021DC vs RCB: దంచికొట్టిన డివిలియర్స్‌..ఇన్నింగ్స్ బ్రేక్

IPL 2021DC vs RCB: ఐపీఎల్ 2021లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు ఆరో మ్యాచ్‌లో తలపడుతున్నాయి.

Samba Siva Rao
Published on: 27 April 2021 9:24 PM IST
Delhi Capitals vs RCB
X

DCvsRCB

IPL 2021DC vs RCB: ఐపీఎల్ 2021లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు ఆరో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 172 పరుగుల లక్ష్యం ఉంచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆదిలోనే ఓపెనర్ విరాట్‌ కోహ్లీ (12) వికెట్ కోల్పోయింది. అవేశ్‌ ఖాన్‌ వేసిన ఓవర్‌లో ఆఖరి బంతికి బౌల్డయ్యాడు. ఆర్సీబీ జట్టు వ్యక్తిగత స్కోరు 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. వెంటనే మరో ఓపెనర్ దేవ్‌దత్‌ పడిక్కల్‌(17) ,మాక్స్‌వెల్‌(25) వెంటనే ఔటయ్యారు. రజత్‌ 31(22)రాణించాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్(42 బంతుల్లో, 75నాటౌట్, 3ఫోర్లు, 5 సిక్సులు) ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సామ్స్‌(3*) పరుగులతో నిలిచాడు. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడగా చెరో నాలుగు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతున్నాయి. దాంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయంసాధించి అగ్రస్థానంలో దూసుకుపోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story