Bumrah Marriage: గోవాలో ఓ ఇంటివాడైన బుమ్రా..

Bumrah Marriage: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నేడు స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌‌ను గోవాలో పెళ్లాడాడు.

Venkata Chari
Published on: 15 March 2021 5:13 PM IST
Indian Pace Bowler Jasprit Bumrah Married Sanjana Ganesan in Goa
X

నూతన వధూవరులు జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌‌ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Bumrah Marriage: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సోమవారం (మార్చి 15) స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌‌ను గోవాలో పెళ్లాడాడు. ఈ వివాహానికి అతికొద్దిమందికి మాత్రమే ఆహ్వానం లభించింది. కరోనా నేపథ్యంలో కేవలం 20 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వేడుకకు హాజరయ్యే అతిధులు మొబైల్ ఫోన్స్‌‌ కూడా తీసుకురావొద్దని కాబోయే వధూవరులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వివాహానికి ముందు జరిగే సంగీత్‌ కార్యక్రమం గత రాత్రే (ఆదివారం) పూర్తయినట్లు తెలుస్తోంది. ఈమేరకు సంజనా గణేషన్ తన ఇన్‌స్టాగ్రాం లో వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

కాగా, బుమ్రా.. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు అతను పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అయితే, ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఐపీఎల్ 2021 సీజన్‌ కు అందుబాటులో ఉంటాడని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. కాగా, ముంబై ఇండియన్స్ గతేడాది టైటిల్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.


Venkata Chari

Venkata Chari

Next Story