Tokyo Olympics: డిఫెండింగ్ ఛాంపియన్‌ అర్జెంటీనాపై భారత హాకీ జట్టు విజయం

* లీగ్‌ మ్యాచుల్లో వరుసగా మూడో విజయం * చివరి లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనున్న భారత జట్టు

Sandeep Reddy
Updated on: 29 July 2021 10:58 AM IST
Indian Hockey Team Won The Match Against Argentina in Tokyo Olympics League Stage Match
X

భారత హాకీ జట్టు (ట్విట్టర్ ఫోటో)

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పురుషుల హాకీ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పూల్‌- ఏ నాలుగో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై విజయం సాధించింది. మూడో క్వార్టర్‌లో మొదటి గోల్ చేసిన టీమిండియా నాలుగో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్‌ చేసింది. దీంతో భారత జట్టు 3-1 తేడాతో ఘన విజయం సాధించింది.

43వ నిమిషంలో కుమార్ వరుణ్‌ తొలి గోల్‌ చేయగా, 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌సాగర్‌ రెండో గోల్‌, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్‌ చేశాడు. ఇప్పటికే గ్రూప్‌ దశలో మూడు మ్యాచులు గెలిచిన భారత హాకీ జట్టు దాదాపు క్వార్టర్స్‌కు చేరినట్లే. అయితే చివరిదైన లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది టీమిండియా.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story