Tokyo Olympics: స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు ఘన విజయం

* ఒలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు * పూల్‌-ఏ మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-0తో ఘన విజయం

Sandeep Reddy
Published on: 27 July 2021 9:46 AM IST
Indian Hockey Team Defeats Spain 3-0 in Tokyo Olympics 2021
X

భారత హాకీ జట్టు(ఫోటో: ట్విట్టర్) 

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. పూల్‌-ఏలో జరిగిన మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది.3-0 గోల్స్‌తో స్పెయిన్‌పై గెలిచిన టీమిండియా పూల్‌-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది భారత జట్టు. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్‌ చేసి స్పెయిన్‌కు షాకిచ్చింది. ఆ తర్వాత స్పెయిన్‌ను ఒక్క గోల్‌ కూడా చేయకుండా కట్టడి చేసింది. మూడో క్వార్టర్‌ వరకు 2-0తో ముందున్న టీమిండియా నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ సాధించింది. రెండు గోల్స్ చేసిన రూపిందర్‌పాల్‌ భారత జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇక తాజా విజయంతో భారత హాకీ జట్టు ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story