Harbhajan Singh Shocked By Electricity Bill: చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు నాకే వేశారా!

Harbhajan Singh Shocked By Electricity Bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి.

Krishna
Published on: 28 July 2020 11:46 AM IST
Harbhajan Singh Shocked By Electricity Bill: చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు నాకే వేశారా!
X
Harbhajan Singh (File photo)

Harbhajan Singh Shocked By Electricity Bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లుకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. చిన్న చిన్న గుడిసెలకు కూడా లక్షల్లో బిల్లు వస్తున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే పరిస్థితిని ఎదురుకుంటున్నారు.. తాజాగా ఇండియన్ వెటరన్ క్రికెటర్ ,చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అవాక్కయ్యాడు.

వాస్తవానికి తానూ కట్టే కరెంట్ బిల్లు కంటే ఏడింతలు ఎక్కువగా వచ్చిందని వాపోయాడు భజ్జీ.. భజ్జీ ఉంటున్న నివాసానికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. అయితే ఈ నెల మొత్తం రూ.33,900 బాకీ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీనితో కరెంట్ బిల్లు చూసి షాక్ అయ్యాడు హర్భజన్‌.. అయితే తన చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ ట్విట్టర్ వేదికగా ఎలక్ట్రిసిటీ బోర్డును ప్రశ్నించాడు భజ్జీ ..

ఇక ఇంతకుముందు హీరోయిన్ తాప్సీ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ అధికారులు ఏకంగా రూ.36 వేల బిల్లు ఇచ్చారని ట్విట్టర్ వేదికగా అధికారులను నిలదీసింది. లాక్‌డౌన్‌ వేళ ఇలాంటి సంఘటనలు చాలా చోట్లలో చోటుచేసుకున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ వలన గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఐపీఎల్ 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి మెుదలుకానుంది. అన్ని జట్లు అక్కడ వెళ్ళడానికి సిద్దమవుతున్నాయి. త్వరలో అక్కడికి వెళ్ళడానికి సిద్దం అవుతున్నాడు హర్భజన్ సింగ్ !

Krishna

Krishna

Next Story