Hanuma Vihari: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన క్రికెటర్

* అల్వాల్‌లోని సురభి ఎన్‌క్లేవ్‌లో మొక్క నాటిన హనుమ విహారి * ద్రవిడ్‌, సిరాజ్‌, శ్రీకృష్ణప్రియకు ఛాలెంజ్‌ విసిరిన విహారి

Sandeep Reddy
Updated on: 1 Oct 2021 12:30 PM IST
Indian Cricketer Hanuma Vihari Participated in Green India Challenge
X

విహారికి ఒక వృక్షం పుస్తకం బహూకరణ (ట్విట్టర్ ఫోటో)

Hanuma Vihari: రాజ్యసభ ఎంపీ జోగినేపల్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమయ్యారు ఇండియన్‌ క్రికెటర్‌ హనుమ విహారి. అల్వాల్‌లోని సురభి ఎన్‌క్లేవ్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విహారికి ఒక వృక్షం అనే పుస్తకాన్ని బహూకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ ద్రవిడ్‌, మహ్మద్‌ సిరాజ్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకృష్ణ ప్రియకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు విహారీ.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story