IND Vs BNG: రెండో టెస్టులో బంగ్లాదేశ్‎పై భారత్ విజయం

IND Vs BNG: రెండు టెస్టుల్లోనూ బంగ్లాపై భారత్ విజయం

Jyothi
Published on: 25 Dec 2022 5:21 PM IST
India Won The Second Test Against Bangladesh
X

IND Vs BNG: రెండో టెస్టులో బంగ్లాదేశ్‎పై భారత్ విజయం

IND Vs BNG: ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ సీరిస్‎ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు దాదాపు టీంఇండియా చేయి జారిపోతున్న సమయంలో టెయిలెండర్స్ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. ఉత్కంఠ పోరులో బంగ్లాపై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల్లోనూ బంగ్లాపై విజయం సాదించడం ద్వార సీరిస్‎ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన టార్గెట్ 145 రన్స్ ను చేధించడానికి టీంఇండియా బ్యాట్స్ మెన్స్ తీవ్రంగా శ్రమించారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ 4 వికెట్లు నష్టానికి 45 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగురోజు ఆట ప్రారంబించారు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోగా అయ్యర్, అశ్విన్ నిలకడగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి మ్యాచ్‎ను పూర్తిగా టర్న్ చేశారు.

భారత్‌-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు మంతి రసవత్తరంగా సాగింది. చేతిలో ఆరు వికెట్లున్నాయి. ఇంకో వంద పరుగులు చేస్తే చాలు రెండో టెస్టు మనోళ్లదే. చూడ్డానికి ఈ సమీకరణం చాలా తేలిగ్గా అనిపించింది. కానీ 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగించింది. బాల్ గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై నిలవడం సవాలుగా మారింది. పుజారా, శుభ్‌మన్‌ స్టంపౌట్‌ అయిపోయారు. కోహ్లి 22 బంతులాడి ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. ఈరోజు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా భారత్ వరుసగా వికెట్లు కోల్పోయిన తరుణంగా అయ్యర్, అశ్విన్ నిలకడగా ఆడటంతో భారత్ విజయం సాధించింది.

Jyothi

Jyothi

Next Story