T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌ టోర్నీని ముగించిన భారత్

* ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై 9 వికెట్ల తేడాతో విజయం * టీ 20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై

Shilpa
Published on: 9 Nov 2021 6:49 AM IST
India Won the Match Against Namibia with 9 Wickets in T20 World Cup 2021
X

టీ20 ప్రపంచకప్‌ టోర్నీని ముగించిన భారత్(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై టీమ్‌ ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియాను భారత్‌ బౌలర్లు 132 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం టీమ్‌ఇండియా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో 136 పరుగులు చేసి విజయం సాధించింది.

దీంతో టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన కోహ్లీకి, హెడ్‌ కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఘన వీడ్కోలు చెప్పినట్టైంది. చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆధిపత్యం కనబరిచిన భారత్‌ విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించినా సెమీస్‌ బెర్తు సాధించలేకపోయింది.

Shilpa

Shilpa

Next Story