IND vs BAN: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

IND vs BAN: 280 పరుగుల తేడాతో బంగ్లాపై భారత్‌ గెలుపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Sept 2024 12:14 PM IST
India Won First Test Against Bangladesh
X

IND vs BAN: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

IND vs BAN: రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 515 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నాలుగోరోజు ఆటలో 234 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్ల తేడాతో చెలరేగడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. జడేజా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.

ఇక బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒక్కడే 82 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు జాకీర్ హసన్ 33 పరుగులు, పద్మాన్ ఇస్లామ్ 35 పరుగులు చేశారు. ఇక షకిబ్ అల్ హసన్ 25 పరుగులు చేయగా భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్‌మన్స్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

బంగ్లాపై ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్ వేదికగా ఈ నెల 27న ప్రారంభంకానుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story