Team India: రెండో టీ-20లో భారత్ విజయం

Team India: విండీస్‌పై 8 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు, మూడు టీ-20ల సిరీస్‌ 2-0తో భారత్‌ కైవసం.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 7:41 AM IST
India Win Second T20
X

Team India: రెండో టీ-20లో భారత్ విజయం

Team India: టీ-20 సిరీస్ ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. రెండో టీ-20లో వెస్టిండీస్ పై టీమిండియా విజయం సాధించింది. విండీస్ పై 8 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మూడు టీ-20ల సిరీస్ లో 2-0తో టీమిండియా అధిక్యం సాధించింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది రోహిత్ సేన.

కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టీ-20లో టాస్‌ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ, రిషబ్ పంత్‌ హాప్‌ సెంచరీలతో అదరగొట్టగా చివర్లో వెంకటేశ్ అయ్యర్‌ ధాటిగా ఆడాడు. విండీస్‌ బౌలర్లలో రోస్టన్ ఛేజ్‌ మూడు, కాట్రెల్‌, షెఫర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక.. 187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 178 పరుగులు చేసింది. విండీస్‌ ఆటగాళ్లు చివరి వరకు దూకుడుగా ఆడినప్పటికీ.. ఫలితం దక్కలేదు. దీంతో భారత్‌ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది భారత్. ఇక ఇండియా బౌలర్లలో చాహల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story