కాసేపట్లో టీ20 సిరీస్ ప్రారంభం.. రెండు టీంల బలాబలాలు ఇవే

కాసేపట్లో టీ20 సిరీస్ ప్రారంభం.. రెండు టీంల బలాబలాలు ఇవే
x
Highlights

కాసేపట్లో టీమిండియా వెస్టిండీస్ టీమిండియాల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానునుంది.

కాసేపట్లో టీమిండియా వెస్టిండీస్ టీమిండియాల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానునుంది. ఈ సిరీస్‌లో తొలి టీ20 హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరనుంది. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో తొలుత బ్యాటింగ్ తీసుకున్న జట్టు పరగులు వరద పరించే అవకాశం ‎ఉంది.

బంగ్లాదేశ్ పై జరిగిన సిరీస్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఊపును విండీస్ పై భారత్ కొనసాగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పై జరిగిన సిరీస్ కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగాడు. విండీస్ సిరీస్ కు కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించనున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ విండీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.

ఇక విండీస్ విషయానికి వస్తే వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను పోలార్డ్ నాయకత్వంలోని విండీస్ ఎంతవరకు నిలవరిస్తుందనేది ప్రశ్నార్థకమే. అయితే ఇటీవలే పసికూన అఫ్ఘానిస్థాన్ పై విజయం సాధించి విండీస్ ఐదు సంవత్సరాల తర్వాత సిరీస్ గెలవడం ఆ జట్టుకు కలిసొచ్చిన అంశమే.అయితే అదే అఫ్గాన్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోవడం ప్రతికూల అంశంమనే చెప్పాలి. టీ20 పాయింట్ల పట్టికలో విండీస్ మాత్రం మెరుగైన స్థితిలో ఉంది.

ఈ సిరీస్‌లో మరో విశేషం ఏమిటంటే, ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలవడానికి ఇద్దరు టీమిండియా క్రికెటర్లు పోటీ పడుతున్నారు. వారిలో కెప్టెన్ కోహ్లీ మరోకరు రోహిత్ శర్మ ఉన్నారు. మూడేళ్లుగా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లీ నిలిచాడు. ఈ సవంత్సరం కోహ్లీకి పోటీగా రోహిత్ (2,090) 93 పరుగుల వ్యత్యాసంలో ఉన్నాడు. ఈ డిసెంబర్ లో ఆరు మ్యాచ్ లే ఉండడంతో హిట్ మ్యాన్ రోహిత్ కోహ్లీని అధికమిస్తాడా అనేది చూడాలి. 2016లో 2,595, 2017లో 2,818 పరుగులతో, 2018లో 2,735 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు

ఈ మ్యాచ్ లో కొత్త రూల్ :

బౌలర్లు విసిరే నోబాల్స్ గుర్తించడంలో ఫీల్డ్ అంపైర్లు విఫలమవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను ‎విషయంలో అనుమానం ఉంటే థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

విండీస్ జట్టు : Lendl Simmons, Evin Lewis, Brandon King, Shimron Hetmyer, Kieron Pollard (c), Denesh Ramdin (wk), Jason Holder, Keemo Paul, Fabian Allen, Hayden Walsh Jr., Sheldon Cottrell

టీమిండియా జట్టు : Rohit Sharma, KL Rahul, Virat Kohli (c), Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (wk), Shivam Dube, Washington Sundar/Ravindra Jadeja, Kuldeep Yadav/Yuzvendra Chahal, Deepak Chahar, Bhuvneshwar Kumar

Show Full Article
Print Article
More On
Next Story
More Stories