Team India: క్రునాల్ తో ఉన్న ఆ 7మందికి కరోనా నెగిటివ్, నేడే రెండో టీ20

Sandeep Reddy
Published on: 28 July 2021 12:38 PM IST
India Vs Sri Lanka T20I 2021 Krunal Pandyas Close Contacts of Team India Players Tested Corona Negative in RTPCR
X

 భారత జట్టు ఆటగాళ్ళు 

India Vs Sri Lanka T20I 2021 - Team India: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు మంగళవారం శ్రీలంకతో టీ20 మరికాసేపట్లో జరగనున్న సమయంలో క్రునాల్ పాండ్యకి కరోనా పాజిటివ్ అని తెలియడంతో భారత టీం యాజమాన్యం వెంటనే క్రునాల్ తో సన్నిహితంగా ఉన్న 8 మంది ఆటగాళ్ళకు మంగళవారం ఆర్టీపీసీఆర్ టెస్ట్ లను చేయించింది. అయితే తాజాగా ఆ రిపోర్టులలో ఎవరికీ కూడా కరోనా నెగిటివ్ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అయితే నిన్న ఈ కరోనా పరిక్షలు పూర్తైన తర్వాత వచ్చే రిపోర్ట్ ని బట్టి రెండో టీ20 జరపాలని బీసిసిఐ నిర్ణయించి బుధవారం సాయంత్రానికి మ్యాచ్ ని వాయిదా వేసింది. ప్రస్తుతం వచ్చిన రిపోర్టులతో మ్యాచ్ ని బుధవారం నిర్వహించడానికి రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బీసిసిఐ నుండి రానుంది.

ఇప్పటికే ఐసోలేషన్ లోకి వెళ్ళిన క్రునాల్ పాండ్యతో ఉన్న హార్దిక్ పాండ్యతో పాటు మరో ఏడుగురు సన్నిహితంగా ఉన్నది ఎవరా అని ఆలోచిస్తూ క్రీడా అభిమానులు తలలు పట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం క్రునాల్ తో హార్దిక్ పాండ్యతో పాటు దేవ్ దత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, సూర్య కుమార్ యాదవ్, పృథ్వి షాలు ఉన్నట్లు తెలిసింది. ఆ ఏడుగురిలో మరొకరి పేరును జట్టు యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లలో క్రునాల్ కి మినహా ఎవరికీ కరోనా లేకపోవడంతో అభిమానులు ఒకింతా తమ సంతోషాన్ని తెలుపుతూ జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక క్రునాల్ పాండ్య స్థానంలో బుధవారం జరగబోయే రెండో టీ20తో కృష్ణప్ప గౌతమ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అడుగుపెట్టనున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story