India vs Sri Lanka: శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైన టీమిండియా

India vs Sri Lanka: శ్రీలంకతో వన్డే సిరీస్ ఫైనల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 22 July 2021 6:11 PM IST
India vs Sri Lanka 3rd ODI Preview
X

India vs Sri Lanka: శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైన టీమిండియా

India vs Sri Lanka: శ్రీలంకతో వన్డే సిరీస్ ఫైనల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ దక్కించున్న యంగ్‌ ఇండియా మూడో వన్డేను కూడా గెలిచి లంకను క్లీన్‌స్వీప్ చేయాలని డిసైడైంది. మరోవైపు రేపు జరగనున్న ఆఖరి మ్యాచ్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఫైనల్ పోరుకు గబ్బర్ సేనలో మార్పులు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. శిఖర్‌తోపాటు మరో కొత్త ఓపెనర్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. పృథ్వీ స్థానంలో పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరికి అవకాశం రావొచ్చంటున్నారు.

మరోవైపు వరుస ఓటములతో శ్రీలంక డీలా పడిపోయింది. మొదటి వన్డేలో తేలిపోయినా రెండో వన్డేలో గట్టిపోటి ఇచ్చారు. ఐతే ఖచ్చింతంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోవడంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. కెప్టెన్‌ దసున శనక, ధనంజయ డిసిల్వా ఫర్వాలేదనిపిస్తున్నా ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అటు క్రీజ్‌లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ ఆగ్రహం వ్యక్తం చేయకుండా ప్రోత్సహిస్తే మంచిది. చివరి మ్యాచులో లెగ్‌స్పిన్‌తో ఆకట్టుకున్న వనిందు హసరంగ మరోసారి కీలకం కానున్నాడు. ఏది ఏమైనా టీ-20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story