Ind Vs SL T20I: కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్..రెండో టీ20 వాయిదా

Sruthi
Updated on: 27 July 2021 5:14 PM IST
India Vs Sri Lanka 2nd T20I Postponed to 28th July 2021 after Indian Player Krunal Pandya Tests Covid19 Positive
X

Krunal Pandya (Photo: Instagram)

Ind Vs SL T20I - Krunal Pandya: భారత క్రీడాభిమానులకు చేదు వార్త.. మంగళవారం శ్రీలంక భారత్ మధ్య జరగనున్న రెండవ టీ 20 వాయిదా అయింది. భారత క్రికెట్ ప్లేయర్ క్రునల్ పాండ్యకి కరోనా పాజిటివ్ అని తేలడంతో అలెర్ట్ అయింది టీం యాజమాన్యం. ఈ మ్యాచ్ ని బుధవారంకి పోస్ట్ పోన్ అవబోతున్నట్లు ఒక ప్రముఖ వార్త సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. జట్టులోని సభ్యులందరికీ కరోన టెస్ట్ లు చేసిన తర్వాత నెగిటివ్ గా తేలితేనే బుధవారం మ్యాచ్ జరగనుంది. దీంతో టీం ఇండియా ప్లేయర్ క్రునల్ తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ఎనిమిది మంది ప్లేయర్స్ ని కూడా ఐసోలేషన్ లో ఉంచినట్లు సమాచారం.

అయితే ఈ సమాచారాన్ని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసీసీఐ) కూడా రెండో టీ 20 మ్యాచ్ జూలై 28 బుధవారం జరగనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. క్రునల్ పాండ్య కి పాజిటివ్ రావడంతో టీం సభ్యుల్లో ఇంకా ఎవరెవరికి కరోనా పాజిటివ్ వస్తుందోనని అటు అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కూడా టెన్షన్ పడుతుంది.


Sruthi

Sruthi

SEO Executive

Next Story