India vs South Africa 2nd T20I: నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెంటో టీ20

India vs South Africa 2nd T20I: సఫారీలతో రెండో టీ20 సమారానికి టీమిండియా సిద్ధమయ్యింది.

Arun Chilukuri
Published on: 11 Dec 2025 12:25 PM IST
India vs South Africa 2nd T20I: నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెంటో టీ20
X

India vs South Africa 2nd T20I: నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెంటో టీ20

India vs South Africa 2nd T20I: సఫారీలతో రెండో టీ20 సమారానికి టీమిండియా సిద్ధమయ్యింది. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ గెలిచింది. సౌత్‌ ఆఫ్రికాని చిత్తుగా ఓడించి మంచి ఉత్సాహంలో ఉంది భారత్. ఇదే ఊపులో ఇవాళ కూడా గెలవాలని టీమిండియా భావిస్తుంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌‌పూర్‌ వేదికగా నేడు రెండో టీ20 జరగునుంది. ఇందుకోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. దీంతో ఇవాల్టి పోరు నువ్వా నేనా అనే విధంగా సాగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

రెండో టీ20 కోసం టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనంతో తొలి మ్యాచ్‌లోనే చలరేగడం భారత్‌కు సంతోషాన్ని ఇస్తుంది. కటక్‌లో కేవలం 28 బంతుల్లోనే.. అజేయంగా 59 పరుగులు చేసిన అతడు, మరోసారి మెరవాలని జట్టుకోరుకుంటుంది. ఇంకా అభిషేక్‌ వర్మ, తిలక్ వర్మ, అక్షర్‌ పటేల్, దూబే, జితేష్ షర్మలతో టీమిండియా బ్యాంటింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సౌతాఫ్రికా లెక్క సరి చేయాలని చూస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story