IND vs SA 2nd ODI: రాంచీలో నేడే రెండో వన్డే.. దక్షిణాఫ్రికా దూకుడుకు..

India vs South Africa 2nd ODI: భారత్ చావోరేవుకు సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 9 Oct 2022 9:46 AM IST
India vs South Africa 2nd ODI in Ranchi
X

IND vs SA 2nd ODI: రాంచీలో నేడే రెండో వన్డే.. దక్షిణాఫ్రికా దూకుడుకు..

India vs South Africa 2nd ODI: భారత్ చావోరేవుకు సిద్ధమైంది. టీ20 సిరీస్ గెలిచిన ఊపులో వన్డేల్లోనే దక్షిణాఫ్రికాను చిత్తు చేసేందుకు టీమిండియా రెడీ అయింది. అయితే టీ20 సిరీస్‌ ఓటమికి వన్డేల్లో ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చూస్తున్నారు. లక్నో వన్డే విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో రాంచీలో సిరీస్‌పై దక్షిణాఫ్రికా గురిపెట్టింది. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్‌ కీలకమైన తరుణంలో దక్షిణాఫ్రికా..భారత్‌కు దీటుగా స్పందించే అవకాశముంది. లక్నోలో టఫ్ ఫైట్ ఇచ్చిన టీమిండియా జట్టును ఎలాగైనా ఓడించాలన్న కసితో నేడు బరిలోకి దిగుతోంది సఫారీ టీం. లక్నో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ ధవన్‌, గిల్‌, ఇషాన్‌కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ విఫలం కాగా, శ్రేయాస్‌ అయ్యర్‌, శాంసన్‌ అద్భుత పోరాట పటిమ కనబరిచారు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్/రాహుల్ త్రిపాఠి/రజత్ పటిదార్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, అవేశ్ ఖాన్

Arun Chilukuri

Arun Chilukuri

Next Story