India vs Pak: త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్.. బీసీసీఐ అధికారి ఏమన్నారంటే..?

India vs Pakistan Will a Series Between India and Pakistan Resume Soon BCCI Official Shares His Thoughts
x

India vs Pak: త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్.. బీసీసీఐ అధికారి ఏమన్నారంటే..?

Highlights

India vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు.

India vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు. ఈ సందర్భంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ పునఃప్రారంభం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లాను దీని గురించి అడగగా ఆయన నేరుగా ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చారు. ది మాత్రమే కాదు, ఫైనల్ మ్యాచ్‌ను దుబాయ్‌లో కాకుండా లాహోర్‌లో నిర్వహించకూడదా అని పాకిస్తాన్ మీడియా అడిగిన ప్రశ్నకు రాజీవ్ శుక్లా వివరణ ఇచ్చారు.

ముందుగా భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ ప్రశ్నకు వద్దాం. పాకిస్తాన్ మీడియా తమ దేశం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్, ఐసిసి ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఇప్పుడు పోయి రెండు దేశాల మధ్య సిరీస్ ప్రారంభం కావాలని మీరు అనుకోలేదా అని రాజీవ్ శుక్లాను అడిగింది. ఈ ప్రశ్న విన్న తర్వాత రాజీవ్ శుక్లా మొదట ఐసిసి ఈవెంట్‌లు, అంతర్జాతీయ జట్లకు ఆతిథ్యం ఇచ్చినందుకు పాకిస్తాన్‌ను ప్రశంసించారు.

తర్వాత భారత్-పాకిస్తాన్ సిరీస్ గురించి మాట్లాడుతూ..‘‘భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ ప్రారంభం గురించి ఓ విషయం స్పష్టంగా ఉందని రాజీవ్ శుక్లా అన్నారు. ప్రభుత్వం కోరుకుంటేనే ఇది జరుగుతుంది. దీనిపై నిర్ణయం భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం బీసీసీఐ పనిచేస్తుంది. భారత్‌తో సిరీస్ ప్రారంభం గురించిన ప్రశ్నకు పాకిస్తాన్‌కు సమాధానం లభించింది. కానీ లాహోర్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ గురించి అడగగా.. లాహోర్‌లో ఫైనల్ జరుగుతుందా అని పాకిస్తాన్ మీడియా అడిగిన ప్రశ్నకు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టు భారత్ ను ఓడించి ఉంటేనే ఇది సాధ్యమయ్యేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories