IND vs PAK: ఉత్కంఠపోరులో పాక్‌పై భారత్ విజయం

India vs Pakistan T20 Match Virat Kohli Guides India to Victory
x

IND vs PAK: ఉత్కంఠపోరులో పాక్‌పై భారత్ విజయం

Highlights

IND vs PAK: ఉత్కంఠపోరులో పాక్‌పై భారత్ విజయం

IND vs PAK: మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు హార్దిక్‌ పాండ్యా(37 బంతుల్లో 40) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లలో రౌఫ్‌, నవాజ్‌ రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories