Ind vs NZ 2nd Test: నేటి నుంచి కివీస్-భారత్ మధ్య రెండో టెస్టు

ద్రవిడ్ పర్యవేక్షణలో ముమ్మరంగా ప్రాక్టీస్ జట్టుతో కలిసిన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ

Sandeep Reddy
Updated on: 3 Dec 2021 8:00 AM IST
India vs New Zealand 2nd Test Match Today 03 12 2021
X

నేటి నుంచి కివీస్-భారత్ మధ్య రెండో టెస్టు

India vs New Zealand 2nd Test: ముంబై వేదికగా నేడు కివీస్‌తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా సన్నద్దమైంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో చేరడంతో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ముంబైలో భారీ వర్షాల వల్ల ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. దీంతో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అనుమతితో భారత ఆటగాళ్లు ఇండోర్‌లోనే ప్రాక్టీస్ చేశారు. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో కెప్టెన్‌ కోహ్లి.. శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, రహానే ప్రాక్టీసు చేశారు. కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన నేపధ్యంలో ఈ మ్యాచ్‌ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story