IND vs NZ: తొలిరోజు ఆటపూర్తి.. సెంచరీతో చెలరేగిన మయాంక్

IND vs NZ: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

Arun Chilukuri
Published on: 3 Dec 2021 7:55 PM IST
India vs New Zealand 2nd Test, Day 1 Highlights
X

IND vs NZ: తొలిరోజు ఆటపూర్తి.. సెంచరీతో చెలరేగిన మయాంక్ 

IND vs NZ: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌ 80 పరుగుల అద్భుత భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో గిల్ సహా పుజారా, కోహ్లీ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ కీపర్ సాహాతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో అగర్వాల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ 120 పరుగులు, సాహా 25 పరుగులతో ఉన్నారు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story