India vs New Zealand: న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా

India vs New Zealand: హార్థిక్ పాండ్యా సారథ్యంలో తలపడనున్న టీమిండియా

Jyothi
Published on: 18 Nov 2022 6:52 AM IST
India vs New Zealand 1st T20 Match | Cricket News
X

 India vs New Zealand: న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా

India vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఇవాళ తొలి టీ20 మ్యాచ్‌లో తలపడబోతోంది. మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ చేరుకున్న టీమిండియాకు హార్థిక్ పాండ్యాకు సారథ్యం వహించబోతున్నారు. టీ20 వరల్డ్ కప్‌ తర్వాత కెప్టన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్‌ లకు విశ్రాంతినిచ్చారు. ఇన్నాళ్లు జట్టులో ఎదురుచూస్తు్న్న ఆటగాళ్లకు ఆడే అవకాశం కల్పించి ఆడించబోతున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లతో టీమిండియా తరఫున నవతరం ఆటగాళ్లు తలపడబోతున్నారు.

టీమిండియా తరఫున హార్థిక్ పాండ్యా సారథ్యంలో జరిగే టీ20 సిరీస్‌లో శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లుగా బరిలోకి దిగబోతున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సంజూశాంసన్, రిషబ్ పంత్, కీలక బాధ్యతలను తీసుకోనున్నారు. హార్థిక్ పాండ్యా ఆల్‌ రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందిస్తారనే విశ్వాసం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. బౌలింగ్ ప్రదర్శనతో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర ఛాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రన్ మాలిక్ తమవంతు సహకారం అందిస్తారని భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story