IND vs IRE: 11 నెలల తర్వాత రీఎంట్రీ.. తొలి ఓవర్‌లోనే 2 వికెట్లతో బుమ్రా బీభత్సం.. డెబ్యూ క్యాప్ అందుకున్న ఇద్దరు..!

India Vs Ireland 1st T20i: డబ్లిన్‌లోని ది విలేజ్ స్టేడియంలో భారత్-ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ బుమ్రా దెబ్బకు తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది.

Arun Chilukuri
Published on: 18 Aug 2023 7:59 PM IST
India Vs Ireland 1st T20i Jasprit Bumrah 2 Wickets in 1st Over Yashasvi Jaiswal Tilak Varma, Rinku Singh
X

IND vs IRE: 11 నెలల తర్వాత రీఎంట్రీ.. తొలి ఓవర్‌లోనే 2 వికెట్లతో బుమ్రా బీభత్సం.. డెబ్యూ క్యాప్ అందుకున్న ఇద్దరు..!

India Vs Ireland 1st T20i: డబ్లిన్‌లోని ది విలేజ్ స్టేడియంలో భారత్-ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, హ్యారీ టేకర్ క్రీజులో ఉన్నారు. లోర్కాన్ టక్కర్ సున్నాకి అవుటయ్యాడు. అతను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతికి చిక్కాడు. బుమ్రాకి ఇది రెండో వికెట్. అంతకుముందు ఆండ్రూ బల్బిర్నీ (4 పరుగులు) బౌల్డ్ చేశాడు.

రింకు సింగ్, ప్రసీద్ధ్ కృష్ణలకు డెబ్యూ క్యాప్‌లు..

రింకూ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణలకు కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా డెబ్యూ క్యాప్‌లు అందించాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. బుమ్రా 11 నెలల క్రితం చివరి మ్యాచ్ ఆడాడు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ కాంపర్, జార్జ్ డాక్రెల్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెజ్మిన్ వైట్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రెయిగ్ యంగ్.

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు సార్లు టీ20 సిరీస్ జరగ్గా రెండింటిలోనూ టీమ్ ఇండియా విజయం సాధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story