Kohli - Rishabh: "కళ్ళు కనిపించట్లేదా" అంటూ రిషబ్ పంత్ పై కోహ్లి ఆగ్రహం

Sandeep Reddy
Updated on: 16 Aug 2021 1:45 PM IST
Ind Vs Eng Test Match Virat Kohli & Rohit Sharma Angry on Rishabh Pant for Playing in Bad Lights at Lords Stadium
X

పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విరాట్ (ట్విట్టర్ ఫోటో)

Virat Kohli - Rishabh Pant: భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ నాలుగో రోజు చివర్లో జరిగిన ఒక సంఘటన చర్చనీయాంశంగా మారింది. రవీంద్ర జడేజా మొయిన్ అలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన తరువాత గ్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ.. రిషబ్ పంత్ తో కలిసి బ్యాటింగ్ కి దిగాడు. మ్యాచ్ ముగియడానికి మరో పది ఓవర్లు మిగిలి ఉండటంతో గ్రౌండ్ లో వెలుతురు సరిగ్గా లేకున్నా మ్యాచ్ ను అలానే కొనసాగిస్తుడటంతో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సాధారణంగా వెలుతురు సమస్య ఉన్నప్పుడు బ్యాట్స్ మెన్ అంపైర్ కి అప్పీల్ చేస్తే మ్యాచ్ ను అక్కడితో ఆపేస్తారు కాని అంపైర్ ని అడగడానికి రిషబ్ పంత్ కాస్త సందేహించడంతో కోపంతో విరాట్ కోహ్లి కళ్ళు కనిపించట్లేదా వెలుతురు సరిగ్గా లేదుగా ఎలా ఆడుతారని సైగ చేయడంతో వెంటనే రిషబ్ అంపైర్ కి చెప్పడంతో అంతటితో మ్యాచ్ ని ముగించేశారు. చివర్లో వెలుతురు సమస్య ఉన్న సమయంలో తెలివిగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ కొత్త బంతి తీసుకునే సమయంలోనే వెంటనే విరాట్ కోహ్లి ఇలా నిర్ణయం తీసుకొని ఆఖరు ఓవర్లలో వికెట్స్ పడకుండా కాపాడాడనే చెప్పాలి. ప్రస్తుతం కోహ్లి రిషబ్ కి డ్రెస్సింగ్ రూమ్ లో నుండి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story