India vs England: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్‌

Arun Chilukuri
Published on: 5 March 2021 4:58 PM IST
Rishabh Pant Made Century
X

India vs England: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్‌

India vs England: నాల్గవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌ సెంచరీ సాధించాడు. 115 బంతుల్లో 100 పరుగులు చేశారు. భారత్‌ జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి భారత స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయాడు. 146 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో రిషబ్‌ పంత్‌ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. ఎటువంటి తడబాటు లేకుండా పరుగులు సాధించాడు. రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌‌లు అద్బుతంగా రాణించడంతో భారత్‌ 84 ఓవర్లకు 259 పరుగులు చేసింది. అంతకు ముందు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 49 పరుగులు చేశాడు. అజింక్యారహానే 27 పరుగులు చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story