భారత్ కు షాక్... నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

Arun Chilukuri
Published on: 27 Feb 2021 3:21 PM IST
భారత్ కు షాక్... నాలుగో టెస్టుకు బుమ్రా దూరం
X

భారత్ కు షాక్... నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు భారత స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు జస్ప్రీత్ బుమ్రా విజ్ఞప్తికి బీసీసీఐ ఓకే చెప్పింది. బుమ్రా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల తనను మ్యాచ్ నుంచి మినహాయించాల్సిందిగా బుమ్రా కోరాడని పేర్కొంది. దీంతో బుమ్రాకు విశ్రాంతినిచ్చామని, అతడి స్థానంలో కొత్తగా ఎవరినీ తీసుకోబోమని తెలిపింది. టీమ్ నూ ప్రకటించింది. కాగా, నాలుగో టెస్టు కూడా అహ్మదాబాద్ లోని మొతెరా వేదికగానే జరుగనుంది. మార్చి 4న మ్యాచ్ మొదలు కానుంది.

కాగా, ఈ సిరీస్ లో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కూల్చాడు. అయితే, రెండో మ్యాచ్ కు దూరమయ్యాడు. మళ్లీ మూడో మ్యాచ్ ఆడినా.. ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా పని లేకుండా అయిపోయింది. మొతెరా పిచ్ పై స్పిన్నర్లే వికెట్లను పడగొట్టారు. సింహ భాగం ఓవర్లను స్పిన్నర్లే వేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story